వారంలో క్రికెట్ కు రెడీః కుంబ్లే
బెంగుళూరుః వెస్టిండీస్ పర్యటనలో దవడ విరడగడంతో భారత్ కు తిరిగి వచ్చిన కుంబ్లేకు గురువారం విజయవంతంగా శస్త్ర చికిత్స జరిగింది. వారంలోగా నెట్ ప్రాక్టీస్ కి సిద్ధమవుతాని, రెండు వారాల్లో మామూలుగా మ్యాచ్ ఆడే శక్తి వస్తుందని బుధవారం విలేకర్లతో మాట్లాడుతూ కుంబ్లే చెప్పారు. శస్త్ర చికిత్స పూర్తయి ఒకరోజే కాగా ఆయనను శుక్రవారమే ఆస్పత్రి నుంచి ఇంటికి పంపారు. కుంబ్లే ఒక వారం విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఐదో టెస్ట్ కు కుంబ్లే స్థానంలో హర్భజన్ సింగ్ ను తీసుకున్నారు.












Click it and Unblock the Notifications
