గ్రాండ్ ప్రి మీట్ ప్రారంభం
హైదరాబాద్: తొలి ఏషియన్ అథ్లెటిక్ గ్రాండ్ ప్రిమీట్ శనివారం నాడిక్కడ ఫ్లడ్ లైట్ల వెలుతురులో ప్రారంభమైంది. గచ్చిబౌలిలో కొత్తగా నిర్మించిన జిఎంసి బాలయోగి అథ్లెటిక్ స్టేడియంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈమీట్‌ను ప్రారంభించారు.
అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేయడానికి, రాష్ట్ర క్రీడాకారులను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. పంజాబ్ జాతీయ క్రీడల్లోవిజయం సాధించిన క్రీడాకారులకు ముఖ్యమంత్రి ఈ సందర్భంగా బహుమతులుఅందజేశారు.












Click it and Unblock the Notifications
