• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఆగ్రా మృతులు 50

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: శాసనసభ్యుల విదేశీ అధ్యయన యాత్రలనుపెంచనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చెప్పారు. ఇటీవల బృందాలుగా విదేశాల్లో పర్యటించి వచ్చిన శాసనసభ్యులతో ఆయన శనివారం సమావేశమయ్యారు.

ఇతర దేశాల్లో అమలు చేస్తున్న సంస్కరణలు మన రాష్ట్రానికి పనికి రావని, వాటిని మన పరిస్థితులకు అనుగుణంగా మల్చుకోవడం అవసరమని ఆయన అన్నారు. భవిష్యత్తులో శాసనసభ్యుల విదేశీ పర్యటనలు మరింత ఫలప్రదం అయ్యేలా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.

తాము పర్యటించి వచ్చిన దేశాల్లో మౌలిక వసతుల కల్పన బాగా వున్నదని శాసనసభ్యులు అభిప్రాయపడ్డారు. అభివృద్ధివిషయంలో ప్రభుత్వానికి, ప్రతిపక్షాలకు మధ్య సమన్వయం ఉన్నదని వారు చెప్పారు. శాసనభ్యుల విదేశీ పర్యటనలు పట్టణాలకే పరిమితం కాకుండా గ్రామాల సందర్శనకు కూడావీలు కలిగేలా చూడాల్సిన అవసరం ఉన్నదని వారన్నారు. తాము తిరిగి వచ్చిన దేశాల్లో ట్రాఫిక్‌, పర్యావరణ సమస్యలు లేవని వారు చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X