సాయుధపోరాటం ఆపండిః బాబు

విజయనగరంః ఆంధ్రప్రదేశ్‌ లో సుస్థిర శాంతి నెలకొనాలనే సంకల్పంతోనే నక్సలైట్లతో చర్చలు ప్రారంభించామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పరు. నక్సలైట్లు సాయుధపోరాటాన్ని విడనాడాలని ఆయన జన్మభూమి కార్యక్రమంలో పాల్గొనేందుకు విజయనగరం వచ్చిన సందర్భంగా విలేకర్లతో మాట్లాడుతూ చెప్పారు. పీపుల్స్‌ వార్‌ తో జరుపుతున్న చర్చలు సత్ఫలితాలివ్వాలన్నదే తమ అభిమతం అన్నారు. నక్సలైట్లు సాయుధపోరాటం బాటను వీడాలంటూ పిసిసి అధ్యక్షుడు ఎం. సత్యనారాయణ రావు పిలుపునివ్వడాన్ని చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఎమ్మెస్సార్‌ ప్రకటన పట్ల చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు.ఒకవైపు చర్చలు జరుగుతుండగానే నక్సలైట్లు హింసకు పాల్పడుతున్నారంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నక్సలైట్లు గ్రామాల్లో సభలు, సమావేశాలు నిర్వహిస్తునే వున్నారని ఆయన అన్నారు. కాల్పులవిరమణను ప్రకటించిన నక్సలైట్లు ఇంకా హింసకు పాల్పడడంఅర్థరహితం అని ఆయన అన్నారు.

రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య వున్నంత వరకు అభివృద్ధి సాధ్యం కాదని ఆయనఅన్నారు. అందుకే నక్సలైట్లతో చర్చలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చిందన్నారు.పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచడం వల్ల ఆర్టీసీ పై 70 కోట్ల రూపాయల భారం పడుతుందని చంద్రబాబుఅంగీకరించారు. అలా అని రవాణా చార్జీలు పెంచితో ఆక్యుపెన్సీ రేటు పడిపోతుందని,అందుకే చార్జీల పెంపుపై తొందరపడడం లేదని ఆయన అన్నారు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+