వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సాయుధ పోరంటే ఎలా?: బాబు

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: సాయుధ పోరాటాన్ని కొనసాగిస్తామనిపీపుల్స్‌వార్‌ చెప్పినప్పుడు చర్చల వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయమని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రశ్నించారు.పీపుల్స్‌వార్‌ చేసిన డిమాండ్లలో సాయుధ పోరాటాన్ని కొనసాగిస్తామనేఅంశం కూడా ఉన్నదని ఆయన చెప్పారు. కేంద్ర హోం మంత్రి ఎల్‌.కె. అద్వానీని కలిసిన అనంతరం ఆయన గురువారంవిలేకరులతో మాట్లాడారు.

సాయుధ పోరాటాన్ని కొనసాగిస్తామనిపీపుల్స్‌వార్‌ చెప్పిన అంశంపై ఒకటి రెండు రోజుల్లోసీనియర్‌ మంత్రులతో చర్చిస్తానని ఆయన చెప్పారు. రాష్ట్రంలో తీవ్రవాద సమస్యనుశాశ్వతంగా పరిష్కరించాలన్నది తన లక్ష్యమని ఆయన అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణే తమ ప్రధాన ధ్యేయమని,అందుకే మంత్రులు పీపుల్స్‌వార్‌ ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నారని ఆయన అన్నారు. ఆయుధాలు పట్టుకుని తిరగరాదని, రాజ్యాంగానికి కట్టుబడి వుండాలని తమ మంత్రులుపీపుల్స్‌వార్‌ ప్రతినిధులకు చెప్పారని ఆయన అన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X