వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విజయనగరిని అలరించిన బాబు

By Staff
|
Google Oneindia TeluguNews

విజయనగరంః చతురోక్తులు, తప్పుచేసిన వారికి సున్నితంగా మందలింపులు, విద్యార్థులకు అభినందనలు, మహిళలకు ప్రోత్సాహకాలు...... విజయనగరం జిల్లా గజపతినగరం మండలం వేమన గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించిన గ్రామసభ సాగిన తీరు ఇది. చంద్రబాబు గ్రామసభ నిర్వహించిన తీరు ఆద్యంతం ప్రజలను ఆకట్టుకుంది. పేదరికం నిర్మూలనకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు సత్ఫలితాలిస్తున్నాయని చంద్రబాబు చెప్పారు.

17వ విడత జన్మభూమి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఆయనవిజయనగరంలో పర్యటించారు. అక్షరాస్యత, కుటుంబ నియంత్రణ వంటిఅంశాలపై ప్రజలతో మాట్లాడించి అందరినీ అలరించారు. 3 వేల కోట్ల రూపాయలతో ప్రారంభించిన వెలుగు, దీపం పధకాలు సత్ఫలితాలిస్తున్నాయని చంద్రబాబు చెప్పారు. మగవారితో సమానంగామహిళలు అభివృద్ధి చెందే వరకు ఎన్ని వేలకోట్లు ఖర్చయినా తెలుగుదేశం ప్రభుత్వం వెనుకాడదని ఆయన ప్రజల హర్షధ్వానాల మధ్య చెప్పారు. ఆడపిల్లల్ని చదివించాల్నిన అవసరాన్ని చంద్రబాబు నొక్కి చెప్పారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు వెంట ఎర్రం నాయుడు,అశోక్‌ గజపతి రాజు తదితరులు పాల్గొన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X