పోటా కింద జమాతే నేత జిలానిఅరెస్టు
శ్రీనగర్ ః హురియత్ కాన్ఫరెన్స్ మాజీ అధ్యక్షుడు, జమాతే ఇస్లామి నేత సయీద్ ఆలి షా జిలానితో పాటు అతని అల్లుడ్ని కాశ్మీర్ పోలీసులు పోటా చట్టం కింది ఆదివారంఅరెస్టు చేశారు. ఉగ్రవాద సంస్థలతో సంబంధం వుండడంతో పాటు వారికి నిధులుఅందజేస్తున్నారనేది జిలానిపై అభియోగం. జిలాని నివాసంతో పాటు ఆయనకు సంబంధించిన 9 భవనాలపై పోలీసులు దాడి చేశారు. ఢిల్లీలోని ఆయన కార్యాలయంపై ఆదాయం పన్ను శాఖ అధికారులు దాడి చేశారు. ఆ తరువాత జిలానిని పోటా కింది అరెస్టు చేసినట్లు పోలీసులు ప్రకటించారు.












Click it and Unblock the Notifications
