ముంబాయిః ప్రముఖ పారిశ్రామికవేత్త, బజాజ్ ఆటో చైర్మన్ రాహుల్ బజాజ్ అస్వస్థతతో ముంబాయి ఆస్పత్రిలో చేరారు.
బజాజ్ గ్రూప్ సంస్థల్లోఒకటైన ముకుంద్ స్టీల్ వార్షిక సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన బజాజ్ శక్రవారంరాత్రి చాతిలో నొప్పిగా వున్నదని చెప్పడంతో ఆస్పత్రిలో చేర్చినట్టు బజాజ్ వర్గాలు చెప్పాయి. బజాజ్ కుటుంబంలో ఈ మధ్య ఆస్తి తగాదాలు తలెత్తిన నేపథ్యంలో రాహుల్ బజాజ్‌అస్వస్థత ఆయన కుటుంబ సభ్యుల్లోనూ ఆ కుటుంబానికి సన్నిహితులైన ఇతర పారిశ్రామిక వేత్తలు కలవరపడుతున్నారు. బజాజ్ సొంత సోదరుడు ఆయన చిన్నాన్న పిల్లలు 6000 కోట్ల రూపాయలవిలువజేసే బజజా గ్రూప్ కంపెనీల్లో ఆస్తుల పంపకానికి పట్టుబడుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.