సియోల్: దక్షిణ కొరియా ఆశలు వమ్మయ్యాయి. సాకర్ వరల్డ్ కప్ పోటీల్లో మంగళవారం జర్మనీ దక్షిణ కొరియాను ఓడించి ఫైనల్‌లోకి దూసుకెళ్లింది. జర్మనీ దక్షిణ కొరియాను 1-0స్కోర్‌తో ఓడించి ఏడోసారి ఫైనల్‌కు చేరి రికార్డు సృష్టించింది.
ఆట మొదలైన 75 నిమిషంలో మైఖెల్ బల్లాక్ స్కోర్ చేసి జర్మనీవిజయం సాధించి పెట్టాడు. అంతకు నాలుగు నిమిషాల ముందు చేసిన తప్పునకు బల్లాక్‌కు రెఫరీ పసుపు పచ్చ కార్డు చూపారు. బ్రెజిల్కు, టర్కీకి మధ్య జరిగేసెమీ ఫైనల్‌లో గెలుపొందే జట్టుతో జర్మనీ ఫైనల్‌లో తలపడుతుంది.