ఎన్నికల సంస్కరణలే పరిష్కారం: లోక్‌సత్తా

హైదరాబాద్‌: ఎన్నికల సంస్కరణల ద్వారానే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని లోక్‌సత్తా కన్వీనర్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌ అన్నారు. అవినీతిఅంతానికి, ఉత్తమ పాలనకు, హామీల అమలుకు ఎన్నికల సంస్కరణలు ఉపయోగపడుతాయని ఆయన శనివారంవిలేకరుల సమావేశంలో అన్నారు.

సమగ్ర ఎన్నికల చట్టం తేవాలని ఆయన సూచించారు. ఎన్నికల కమిషన్‌ తలపెట్టిన సంస్కరణలను ఆయనస్వాగతించారు. అవినీతి బట్టబయలు కావడానికి, నేరస్థులను ఎన్నికలకు దూరంగా వుంచడానికి ఎన్నికల సంస్కరణలు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. రాజకీయ పార్టీల నియంత్రణకు ఎన్నికల సంస్కరణలు ఉపయోగపడుతాయని,అందుకే రాజకీయ పార్టీలు సంస్కరణలకు సుముఖంగా లేవని ఆయన అన్నారు. రాజకీయ పార్టీలకు ఎన్నికల నిధులు ఏర్పాటు చేయడం వంటి సంస్కరణలు పార్టీలకు అనుకూలమైనవేనని ఆయన అన్నారు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+