ఎన్నికల సంస్కరణలపై అఖిల పక్షం

న్యూఢిల్లీ: రాజకీయాలు నేరమయం కావడాన్ని నిరోధించడానికి, ప్రజా జీవితంలో దాపరికం లేకుండా వ్యవహరించడానికి వచ్చే వర్షాకాలం సమావేశాల్లో సమగ్ర చట్టం తెచ్చేవిషయంలో ఏకాభిప్రాయ సాధనకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా సోమవారం అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసింది.

ఎన్నికల సంస్కరణలకు సంబంధించివిషయాలను ఆచరణాత్మక పద్ధతిలో పరిశీలించి, లక్ష్య సాధనకు ఆచరణాత్మకమైన చర్యలు తీసుకోవాలని ఉప ప్రధాని ఎల్‌.కె. అద్వానీ సమావేశంలో అన్నారు. రాజకీయాలు నేరమయం కావడాన్నిఅరికట్టే విషయంలో సుప్రీంకోర్టు లేవనెత్తినఅంశాలను ప్రభుత్వం ఆహ్వానిస్తోందని ఆయన చెప్పారు. సభ్యుల అనర్హతకు సంబంధించి చట్టాలను తేవడానికి పార్లమెంటుకు అధికారం ఉన్నదని కాంగ్రెస్‌ నేత ప్రణబ్‌ ముఖర్జీ అన్నారు.

నేర సంబంధ విషయాలను, ఆస్తులను, అప్పులను,విద్యార్హతలను ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు వెల్లడించడాన్ని అనివార్యం చేస్తూ ఎన్నికల కమిషన్‌ విడుదల చేసినవివాదాస్పద నోటిఫికేషన్‌పై చర్చించడానికి అఖిల పక్ష సమావేశం ఏర్పాటయింది. ఈ సమావేశంలోఅద్వానీతో పాటు న్యాయ శాఖ మంత్రి జనా కృష్ణమూర్తి, సహాయ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌, సిపిఐ నేత ఎ.బి. బర్ధన్‌, జె. చిత్తరంజన్‌, తదితరులు పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+