IndiGo Flight: విమానంలో బాంబు ఉందని బెదిరింపు నోట్.. అత్యవసర ల్యాండింగ్ చేసిన పైలట్..

ఇటీవలి కాలంలో విమానాలు అత్యవసర ల్యాండింగ్ కు గురవుతున్నాయి. విమానాల్లో బాంబు ఉందని బెదిరింపులు రావడంతో పైలట్ లు ఈ నిర్ణయం తీసుకుంటున్నారు. గతేడాది ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం తర్వాత ఇలాంటి ఘటనలు విమాన ప్రయాణికుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. పది రోజుల క్రితం ఎయిర్ ఇండియా విమానంలోని టాయిలెట్ లో బాంబు అని రాసి ఉన్న ఓ టిష్యూ పేపర్ ను విమాన సిబ్బంది గుర్తించి పైలట్ ను అప్రమత్తం చేయగా.. వెంటనే పైలట్ విమానాన్ని అహ్మదాబాద్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మరువక ముందే మరో షాకింగ్ ఘటన జరిగింది. తాజాగా ఇండిగో విమానంలో బాంబు ఉందని ఓ లేఖ ప్రత్యక్షం కావడంతో పైలట్ వెంటనే విమానాన్ని అహ్మదాబాద్ లో అత్యవసర ల్యాండింగ్ చేశారు.

తాజాగా లక్నో నుంచి దమ్మమ్ వెళ్తున్న ఇండిగో విమానంలో గురువారం సాయంత్రం షాకింగ్ ఘటన జరిగింది. అధికారులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. 6E97 పేరుగ‌ల ఇండిగో విమానం గురువారం సాయంత్రం 4 గంటల 17 నిమిషాలకు ఉత్త‌ర ప్ర‌దేశ్ రాజ‌ధాని ల‌క్నో నుంచి సౌదీ అరేబియాలోని దమ్మమ్ కు బ‌య‌ల్దేరింది. అయితే విమానంలో బాంబు అని రాసి ఉన్న టిష్యూ పేపర్ లభ్యం కావడంతో విమాన సిబ్బంది అప్రమత్తమై పైలట్ కు సమాచారం అందించింది. వెంటనే పైలట్ ఏటీసీకి స‌మాచారం అందించాడు. వారు వెంట‌నే ఎమ‌ర్జెన్సీ ల్యాండింగ్‌ కు అనుమ‌తించారు. దాంతో సాయంత్రం 5 గంటల 43 నిమిషాల సమయంలో గుజ‌రాత్‌ లోని అహ్మ‌దాబాద్‌ లో ఇండిగో పైలట్ సేఫ్ ల్యాండింగ్ చేశాడు.

Indigoflight Bomb threat note on flight viral news latest now pilot emergency landing in Ahmedabad

ఈ ఘటన సమయంలో విమానంలో సిబ్బందితోపాటు మొత్తం 133 మంది ఉన్నట్లు సమాచారం. ఇక ఎమర్జెన్సీ ల్యాండింగ్ తర్వాత ప్రయాణికులందరినీ సురక్షితంగా విమానం నుంచి దించేశారు. విమానాన్ని దూరంగా టెర్మిన‌ల్ 2కు త‌ర‌లించారు. ఇక ఈ ఘటనపై విమానాశ్రయ భద్రతా సిబ్బంది, ఫైర్ సిబ్బంది అలాగే బాంబ్ స్క్వాడ్ సహా పలు విభాగాలు దర్యాప్తు కొనసాగిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+