Nanded Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది మృతి.. మరో ముగ్గురికి సీరియస్

మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ ట్రక్కు- ప్యాసింజర్ వ్యాన్ ఎదురెదురుగా వచ్చి ఢీ కొట్టిన ఘటనలో 9 మంది మృతి చెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. నాందేడ్- భోకర్ రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది. సీతాఖంది ఘాట్ వద్ద రాత్రి 8 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. టాటా మ్యాజిక్ వ్యాన్ నాందేడ్ నుంచి భోకర్ కు వెళ్తుండగా అటు నుంచి ఎదురుగా వస్తున్న ట్రక్ ను ప్రమాదవశాత్తూ ఢీ కొట్టింది. దాంతో ఘోర ప్రమాదం జరిగింది. ఘటన జరిగిన వెంటనే స్థానికులు హుటాహుటిన అక్కడకు చేరుకుని గాయపడిన వారిని సమీప ఆస్పత్రులకు తరలించారు. వ్యాన్ లో ఇరుక్కుపోయిన మృత దేహాలను వెలికి తీశారు. అలాగే పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని నుజ్జు నుజ్జు అయిన వ్యాన్ నుంచి మృత దేహాలను వెలికి తీసేందుకు తీవ్రంగా శ్రమించారు. వారికి స్థానికులు సాయపడ్డారు. ఘటన సమయంలో వ్యాన్‌ లో 12 మంది ప్రయాణికులు ఉండగా.. 9 మంది ఘటనాస్థలిలోనే మృతి చెందారు.

Nanded Road Accident Horrific road accident in Maharashtra 9 dead three others in serious condition

ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి ఎమర్జెన్సీ ట్రీట్ మెంట్ కోసం తరలించామని వారి పరిస్థితి సీరియస్ గా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. మరోవైపు వ్యాన్‌ లోని ప్రయాణీకులందరూ స్థానికులేనని ప్రాథమికంగా నిర్ధారించినట్లు పోలీసులు స్పష్టం చేశారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+