ఉమ్మడి గస్తీకి భారత్‌ సిద్ధం

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేసేందుకు ఎన్నికల కమిషన్‌ తీసుకున్న చర్యలను అఖిల పక్ష సమావేశం తిరస్కరించింది. నేర రాజకీయాలను అడ్డుకోవడానికి, ప్రజా జీవితంలో పారదర్శకతకు సమగ్ర చట్టం తేవాలని సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఈ విధమైన చర్యలు రాజకీయంగా దుర్వినియోగం అవుతాయని అన్ని పార్టీలు ముక్తకంఠంతో అభిప్రాయపడినట్లు బిజెపి నేతవి.కె. మల్హోత్రా సమావేశానంతరం విలేకరులకు చెప్పారు.వివాదాస్పదమైన ఎన్నికల కమిషన్‌ నోటిఫికేషన్‌పై న్యాయశాఖ మంత్రి జనా కృష్ణమూర్తి సోమవారం ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశం మూడు గంటల పాటు సాగింది.

ఎన్నికల కమిషన్‌ మార్గదర్శక సూత్రాల మేరకు అభ్యర్థి నామినేషన్‌ను తిరస్కరించే అధికారం రెవెన్యూ అధికారికి సంక్రమిస్తుందని, ఇది దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉన్నదని మల్హోత్రా అన్నారు. నేర రాజకీయాలను అదుపు చేయడానికి ఒక చట్టం అవసరమని, అయితే న్యాయ వ్యవస్థ లేదా చట్టబద్ధ సంస్థ ఆదేశాలకు వదిలేయకూడదని కాంగ్రెస్‌ నేత ప్రణబ్‌ ముఖర్జీ అన్నారు. క్షుణ్నంగా పరిశీలించిన అనంతరం ఎన్నికల కమిషన్‌ మార్గదర్శక సూత్రాల స్థానంలో చట్టం తేవాలని రాజకీయ పార్టీలు చేసిన సూచనను ప్రభుత్వంఅంగీకరించిందని ఆయన చెప్పారు. ఇది అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయమని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+