సోనియాకు ఎమ్మెస్సార్ లేఖ
హైదరాబాద్‌ః ఆంధ్రప్రదేశ్ లో కరవు పరిస్థితిపై పార్లమెంటులో ప్రస్తావించాల్సిందిగా పిసిసి అధ్యక్షుడు ఎం. సత్యనారాయణరావు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాశారు. కరవుతో అల్లాడుతున్న ఆంధ్రప్రదేశ్ దీనస్థితిని పార్లమెంటులో ప్రస్తావించి ఎన్టీఏ ప్రభుత్వం దృష్టి తీసుకువెళ్ళాల్సిందిగా ఆయన శుక్రవారం నాడు సోనియాకు పంపినలేఖలో విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో నెలకొన్న కరవు పరిస్థితిపై కాంగ్రెస్ రాష్ట్రాల సి.ఎం.లతో సోనియా సమావేశం ఏర్పాటు చేసిన విషయం విదితమే. అయితే ఆంధ్రరాష్ట్రంలో కరవు పరిస్థితి మరీ దారుణంగా వున్న దరిమిలా ఇక్కడ రైతుల గోడును పార్లమెంటులో వినిపించాల్సిందిగా ఆయనకోరారు.












Click it and Unblock the Notifications
