భారీ వర్షాలు: పంటలు జలమయం
హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల రాష్ట్రంలోవిస్తారంగా వర్షాలు కురిశాయి. ఎడతెరిపి లేని వర్షాలకు ఉత్తర తెలంగాణలో జన జీవితంఅస్తవ్యస్తమైంది. కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో భారీ నష్టం సంభవించింది. వందలాది పంటపొలాలు నీటిలో మునిగిపోయాయి.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఒరిస్సాకు పశ్చిమంగా మధ్యప్రదేశ్‌కువిస్తరిస్తోంది. దీని వల్ల ఉత్తర తెలంగాణాలో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి. వచ్చే 12 గంటలలో తెలంగాణాలో భారీగా, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో చెదురుమొదురుగా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణపరిశోధనా కార్యాలయం అధికారులు చెబుతున్నారు.
గోదావరి నదిలో వరద ఉధృతి పెరిగింది. ధవళేశ్వరం వద్ద వరద నీటి మట్టం గణనీయంగాపెరిగింది. దుమ్ముగూడెం, భద్రాచలంల వద్ద కూడా వరద మట్టంపెరిగింది. భద్రాచలం వద్ద వరద నీటి మట్టం 31 అడుగులకు చేరుకుంది.












Click it and Unblock the Notifications
