చిట్టిబాబు విడుదలలో ప్రతిష్టంభన
విశాఖపట్నం: తమ చెరలో ఉన్న పోలీసు కానిస్టేబుల్ చిట్టిబాబును పీపుల్స్‌వార్ నక్సలైట్లు బుధవారం సాయంత్రం వరకు కూడా విడిచిపెట్టలేదు. చిట్టిబాబు విడుదల కోసం పోలీసులు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.
ఇదిలావుంటే, చిట్టిబాబుపై ఆరోపణలు చేస్తూ నక్సల్స్ కొన్ని పత్రికా కార్యాలయాలకుఫాక్స్ ద్వారా మంగళవారం రాత్రి ఒక ప్రకటనపంపారు. చిట్టిబాబుపై చార్జిషీట్ దాఖలు చేసినట్లుపీపుల్స్‌వార్ విశాఖజిల్లా చింతపల్లి- కోరుకొండ దళ సభ్యుడు ఎర్రన్న అలియాస్ గంగరాజు ఆ ప్రకటనలో తెలిపాడు. ఈ లేఖను ఎర్రన్న ఈ నెల 25వ తేదీననే రాసినప్పటికీ అది 27వ తేదీ రాత్రి పత్రికా కార్యాలయాలకు చేరింది.












Click it and Unblock the Notifications
