గ్రామాలకు తరలనున్న ఆంధ్ర బిజెపి
వరంగల్‌ః దేశాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న పలు పథకాల గురించి వివరించేందుకు బృహత్ పథకాన్ని చేపట్టనున్నట్లు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి విద్యాసాగర్ రావు వెల్లడించారు. గ్రామాలకు తరలండి అనే నినాదంతో వేలాది మంది బిజెపి కార్యకర్తలు రాష్ట్రంలోని అన్ని పల్లెల్లో పర్యటిస్తారని ఆయన గురువారం వరంగల్ లో విలేకర్ల సమావేశంలో చెప్పారు. పల్లెసీమల అభివృద్ధికి ఎన్టీఏ ప్రభుత్వం చేపడుతున్న పథకాలని వారు ప్రజలకు వివరిస్తారని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
