విశాఖ-తిరుపతి ప్రయాణికులకు రైల్వే గుడ్ న్యూస్.!

ఏపీలోని విశాఖపట్నం నుంచి తిరుపతి మధ్య పండుగల సీజన్ లో రైలు ప్రయాణికుల రద్దీ పెరుగుతోంది. దీంతో ఈ మార్గంలో వెళ్లే రైళ్లన్నీ కిక్కిరిసిపోతున్నాయి. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ పలు ప్రత్యేక రైళ్లను ప్రకటిస్తోంది. అలాగే ప్రస్తుతం నడుపుతున్న ప్రత్యేక రైళ్లను సైతం మరికొంతకాలం పొడిగిస్తుంది. ఇదే క్రమంలో దక్షిణ కోస్తా రైల్వే మరో కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతం నడుపుతున్న రెండు ప్రత్యేక రైళ్లను ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో మరికొంతకాలం పొడిగించాలని నిర్ణయించింది.

ప్రస్తుతం తిరుపతి నుంచి విశాఖపట్నానికి ప్రతీ ఆదివారం, గురువారం రెండు ప్రత్యేక రైళ్లను (Tirupati-Visakhapatnam Special Trains నంబర్ 08509) దక్షిణ కోస్తా రైల్వే నడుపుతోంది. వీటిని ఈ నెల 10 వరకూ నడపాలని గతంలో నిర్ణయించారు. ఇప్పుడు పెరుగుతున్న రద్దీ నేపథ్యంలో ఈ రెండు రైళ్లను తిరిగి సెప్టెంబర్ 13 నుంచి నవంబర్ 26 వరకూ పొడిగిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ లెక్కన మరో 22 సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి.

Visakhapatnam Tirupati Special Trains

అలాగే విశాఖపట్నం నుంచి తిరుపతికి ప్రతీ సోమవారం, శుక్రవారం మరో రెండు ప్రత్యేక రైళ్లను (Visakhapatnam-Tirupati Special Trains) నంబర్ 08510తో నడుపుతున్నారు. ఈ రెండు రైళ్లనూ ఈ నెల 11వ తేదీ వరకూ నడపాలని గతంలో నిర్ణయించారు. కానీ ప్రస్తుతం ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో వీటిని తిరిగి సెప్టెంబర్ 14 నుంచి మొదలుపెట్టి నవంబర్ 27 వరకూ పొడిగించాలని అధికారులు నిర్ణయించారు. దీంతో మరో 22 అదనపు సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఈ రెండు రైళ్లకూ ప్రస్తుతం ఉన్న స్టాప్ లే కొనసాగుతాయని, అలాగే కోచ్ లు కూడా అవే ఉంటాయని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఈ రెండు రైళ్లకూ 22 ఐసీఎఫ్ కోచ్ ల చొప్పున ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+