నాని 'ది ప్యారడైజ్' ఊచకోత: కేవలం 4 గంటల్లోనే!

నేచురల్ స్టార్ నటించిన మోస్ట్ అవేటెడ్ మూవీ 'ది ప్యారడైజ్' ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్‌లో సరికొత చరిత్రను సృష్టించింది. ఉత్తర అమెరికాలో 'ది ప్యారడైజ్' సినిమా టికెట్ బుకింగ్స్ ప్రారంభమైన కొద్ది సేపట్లోనే ఊహించని రీతిలో భారీ స్పందన లభించింది. 'సినీమార్క్' థియేటర్ చైన్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ టికెట్లు రికార్డు స్థాయిలో అమ్ముడవుతున్నాయి.

'ఎపిక్' ముద్దు సీన్‌ వివాదం.. నిర్మాత నాగ వంశీ షాకింగ్ కామెంట్స్!
'ఎపిక్' ముద్దు సీన్‌ వివాదం.. నిర్మాత నాగ వంశీ షాకింగ్ కామెంట్స్!

బుకింగ్స్ ప్రారంభమైన కేవలం 4 గంటల్లోనే ఈ సినిమా లక్ష డాలర్ల గ్రాస్ కలెక్షన్ల మార్కును దాటేసింది. తెలుగు సినిమా చరిత్రలోనే ఓవర్సీస్ మార్కెట్లో ఇంత వేగంగా ఈ మైలురాయిని చేరుకున్న తొలి చిత్రంగా 'ది ప్యారడైజ్' రికార్డును సాధించింది. డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ అన్ని ప్రాంతాల్లోనూ అత్యంత వేగంగా కొనసాగుతున్నాయి.

Nani The Paradise Movie Creates History in USA Crosses 100K Pre-Sales in 4 Hours Full Details

సుధాకర్ చెరుకూరి అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన 'ఆయా షేర్', 'ఏషనాగుల' పాటలు విశేషంగా ఆకట్టుకోవడంతో ఈ అంచనాలు మరింత రెట్టింపయ్యాయి. రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ అందించిన మ్యూజిక్ సినిమాపై ఉన్న క్రేజ్ ను మరో స్థాయికి తీసుకెళ్లింది. ప్రస్తుతం నడుస్తున్న అడ్వాన్స్ బుకింగ్ ట్రెండ్స్ చూస్తుంటే.. ఈ సినిమా నాని కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించబోతోందని స్పష్టం అవుతోంది.

Kaaka Movie: 'కాకా’లో చిరంజీవికి ఈమెనే స్పెషల్..!
Kaaka Movie: 'కాకా’లో చిరంజీవికి ఈమెనే స్పెషల్..!

అయితే ఈ సినిమా విడుదల తేదీపై రకరకాల వార్తలు వినిపిస్తుండగా.. ఆ పుకార్లన్నింటికీ చెక్ పెడుతూ చిత్ర బృందం రిలీజ్ డేట్‌ను ఖరారు చేసింది. ముందుగా ప్రకటించినట్లుగానే సెప్టెంబర్ 24న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా ట్రైలర్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+