మన దేశంలోనే లేని అరుదైన కోతులు.. ఈ అడవిలోకి ఎలా వచ్చాయి?

భారతీయ అడవుల్లో ఏనాడూ కనిపించని, అసలు మన దేశ వాతావరణానికే చెందని అంతర్జాతీయ జీవులు ఒక్కసారిగా ఒడిశా గ్రామీణ ప్రాంతంలో ప్రత్యక్షమవ్వడం తీవ్ర కలకలం రేపింది. బాలాసోర్ డివిజన్, భోగ్రాయ్ బ్లాక్‌లోని బడపాలి గ్రామం సమీపంలో మంగళవారం ఉదయం ఐదు అరుదైన 'ఒరాంగుటాన్' (చింపాజీ లాంటివి) పిల్లలు స్థానికులకు కనిపించాయి.

మొదట వింత కోతులేవో సంచరిస్తున్నాయని గ్రామస్థులు భావించినప్పటికీ, సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా అవి ఇండోనేషియా, మలేషియా వంటి విదేశీ అడవుల్లో మాత్రమే పెరిగే అరుదైన 'ఒరాంగుటాన్లు' అని తేలడంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

అడవిలో ఒంటరిగా పసికందులు.. క్షేమంగా కాపాడిన అధికారులు

లభ్యమైన ఐదు ఒరాంగుటాన్లలో మూడు మగ, రెండు ఆడ పిల్లలు ఉన్నాయి. వీటి వయసు కేవలం ఏడాది మాత్రమే ఉంటుందని అధికారులు అంచనా వేశారు. అంత చిన్న వయసున్న జీవులు స్వయంగా అంత దూరం ప్రయాణించి రావడం అసాధ్యమని, పైగా రాత్రికి రాత్రే గుంటనక్కలు, అడవి కుక్కలు, కొండముచ్చుల బారిన పడకుండా ఇక్కడ మనుగడ సాగించడం కూడా కష్టమని అధికారులు విశ్లేషించారు.

Five Rare Orangutans Rescued in Odisha Forest as Officials Suspect International Wildlife Smuggling

సమాచారం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి జనం భారీగా తరలిరావడంతో, అటవీ సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి ఆ ఐదింటినీ క్షేమంగా రక్షించి ఉదయ్‌పూర్ సెక్షన్ ఆఫీస్‌కు తరలించారు. అనంతరం పశువైద్యులు, జీవశాస్త్రవేత్తలు వాటికి ప్రాథమిక వైద్యం అందించగా, నందన్‌కానన్ జూ పార్క్ మరియు వైల్డ్‌లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (WTI) శాస్త్రవేత్తల మార్గదర్శకత్వంలో వాటికి పోషకాహారం, ORS అందించారు. ప్రస్తుతం ఈ ఐదు చిన్నారులు పూర్తి ఆరోగ్యంగా, చురుగ్గా ఉన్నాయని అధికారులు స్పష్టం చేశారు.

చేపల కోసం 70 ఏళ్ల డ్యామ్ నేలమట్టం.. ప్రకృతి సాధించిన అరుదైన విజయం!
చేపల కోసం 70 ఏళ్ల డ్యామ్ నేలమట్టం.. ప్రకృతి సాధించిన అరుదైన విజయం!

అంతర్జాతీయ స్మగ్లింగ్ ముఠా హస్తం?

భారతదేశంలో సహజంగా కనిపించని ఈ విదేశీ జీవులు ఇక్కడికి ఎలా వచ్చాయనే దానిపై అటవీ శాఖ తీవ్రంగా దృష్టి సారించింది. మానవ ప్రమేయం, ముఖ్యంగా అంతర్జాతీయ వన్యప్రాణుల అక్రమ రవాణా (స్మగ్లింగ్) కోణంలో బలమైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

బాలాసోర్ డిఎఫ్‌ఓ ఇందల్కర్ ప్రతీక్ ప్రకాష్ మాట్లాడుతూ.. "ఇది ఖచ్చితంగా స్మగ్లింగ్ అని ఇప్పుడే నిర్ధారించలేకపోయినా, ఈ జీవులు సొంతంగా ఇక్కడికి రాలేవు. ఎవరో వీటిని ఇక్కడికి తీసుకువచ్చి వదిలేసి ఉండవచ్చని భావిస్తున్నాం" అని తెలిపారు.

మోదీకి ఇచ్చే లోపే ముక్కలైంది.. అరుదైన తీపి కానుక
మోదీకి ఇచ్చే లోపే ముక్కలైంది.. అరుదైన తీపి కానుక

ఘటనపై దర్యాప్తు అధికారిని నియమించిన అటవీ శాఖ, చుట్టుపక్కల ప్రాంతాల్లో కూంబింగ్ నిర్వహించడంతో పాటు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తోంది. అంతర్జాతీయ స్థాయి వన్యప్రాణుల అక్రమ రవాణా నెట్‌వర్క్ ముడిపడి ఉండే అవకాశం ఉన్నందున పోలీసులు, వైల్డ్‌లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో (WCCB), అలాగే స్టేట్ టాస్క్ ఫోర్స్ (STF) ఏజెన్సీలతో కలిసి సంయుక్తంగా దర్యాప్తు వేగవంతం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+