వీరప్పన్‌కు నాగప్ప భార్యవిజ్ఞప్తి
కామగెరి: తన భర్త నాగప్పకు ఏ విధమైన హానీ తలపెట్టవద్దని, సాధ్యమైనంత త్వరగా విడుదల చేయాలని ఆయన భార్య పరిమళ అడవిదొంగవీరప్పన్‌కు విజ్ఞప్తి చేశారు. ఆమె తన విజ్ఞప్తిని ఆకాశవాణిలో ప్రసారం చేసేందుకు రికార్డు చేశారు. ఆమె తన భర్తకు కూడా సలహా ఇచ్చారు.మీ ఆరోగ్యం జాగ్రత్త, మీరు షుగర్ పేషంట్ అనేవిషయం మర్చి పోకండి అని భర్త నాగప్పకు విజ్ఞప్తి చేశారు.
తనను సోదరిగా భావించి, తన భర్తను బాగా చూడాలని, వెంటనే విడుదల చేయాలని కూడా పరిమళవీరప్పన్‌ను కోరారు. అధైర్యపడవద్దని ఆమె భర్త నాగప్పనుకోరారు. ప్రతిరోజూ పంచాక్షరి మంత్రం పఠించాలని కూడా ఆమె సూచించారు. నాగప్ప వాడాల్సిన మందుల గురించి ఆమె గుర్తు చేసి వాటిని తెప్పించిఅందజేయాల్సిందిగా వీరప్పన్‌కు సూచించారు.
వందలాది మంది ఇంటికి వచ్చి పరిమళను పరామర్శించి పోతున్నారు.వీరిలో చాలా మంది ప్రముఖ రాజకీయ నాయకులున్నారు. వారికి ఆమె కృతజ్ఞతలు తెలియజేస్తూ ధైర్యాన్ని కూడగట్టుకుంటున్నారు.తన భర్తను వీరప్పన్ వదిలిపెడతాడని ఆమె ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రాజ్‌కుమార్‌ను విడుదల చేసిన ఉదంతాన్ని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications
