ముషారఫ్ పై అమెరికా అతివిశ్వాసం
వాషింగ్టన్‌ః కాశ్మీర్ లో తీవ్రవాదుల చొరబాట్లను అరికట్టే విషయంలో పాక్ అధ్యక్షుడు ముషారఫ్ పై తమకు విశ్వాసం వున్నదని అమెరికా చెబుతున్నది. అయితే కాశ్మీర్ లోని పలు స్వచ్ఛంద సంస్థలు మాత్రం ఇంకా చొరబాట్లు తగ్గలేదని, నిత్యం హింస జరుగుతున్నదని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పాకిస్తాన్ లోని తీవ్రవాద సంస్థలు కూడా రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తునే వున్నాయి. కాశ్మీర్ కు చొరబాట్లు తగ్గాయే తప్ప ఆగలేదని భారత్ స్పష్టం చేస్తునే వుంది. అయితే అమెరికా ప్రభుత్వం మాత్రం పాకిస్తాన్ అధ్యక్షుడు ముషారఫ్ పై కొండంత విశ్వాసంతో వుంది.












Click it and Unblock the Notifications
