న్యూజిలాండ్ పై ఆస్ట్రేలియా గెలుపు
కొలొంబో: ప్రపంచ ఛాంపియన్ ఆస్ట్రేలియా ఆదివారం జరిగిన ఛాంఫియన్స్ ట్రోఫిలో న్యూజిలాండ్ ను చిత్తుగా ఓడించింది. గ్లెన్ మెక్ గ్రాత్ బౌలింగ్ కు న్యూజిలాండ్ ఆటగాళ్ళు దాసోహం అన్నారు. ఆస్ట్రేలియా 164 పరుగుల భారీ తేడాతో న్యూజిలాండ్ పై విజయం సాధించింది. కొలొంబోలో ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ చేసింది. ఏడు వికెట్ల నష్టానికి 297 పరుగులు చేసి, న్యూజిలాండ్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది.
మార్టిన్ 73 పరుగులు చేయగా, ఆడం గిల్ క్రిస్ట్ 44 పరుగులు, హేడెన్ 43 పరుగులు సాధించారు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ వెంటవెంటనే వికెట్లను కోల్పోయింది. గ్లెన్ మెక్ గ్రాత్ విరుచుకుపడ్డాడు. 10 ఓవర్లోనే న్యూజిలాండ్ ఐదు వికెట్లు కోల్పయింది.
చివరి బ్యాట్స్ మెన్ కొంత నిలదొక్కుకొన్నప్పటికీ 26 ఓవర్లలో కేవలం 132 పరుగులు చేసి ఆలైటైంది. ఈ మ్యాచ్ లో ఏడు వికెట్లు తీసిన మెక్ గ్రాత్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది.












Click it and Unblock the Notifications
