గుజరాత్ లో రాష్ట్రపతి పాలన తప్పనిసరి
న్యూఢిల్లీ: గుజరాత్ లోఅక్టోబర్ మూడు తర్వాత రాష్ట్రపతి పాలన విధించడమే మంచిదని ఎన్నికల కమిషన్ అభిప్రాయపడింది. గుజురాత్ లో ఇప్పుడు ఎన్నికల జరపడం సాధ్యం కాదని ఎన్నికల కమీషన్ వాదించింది. గుజరాత్ లో ఎన్నికలపై ఏర్పాటైన రాజ్యంగ ధర్మాసనం ముందు ఎన్నికల కమిషన్ బుధవారం తన వాదనలనువినిపించింది. రాష్ట్రపతి నివేదికను సమాధానం ఇవ్వకుండానే తిప్పి పంపాలని కమీషన్ తరపు లాయరు కె.కె.వేణుగోపాల్‌కోరారు. రాష్ట్రపతి ఊహాజనిత ప్రశ్నలు లేవనెత్తినందున వాటికి సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన వాదన.
అందువల్ల రాజ్యంగ సంక్షోభాన్ని నివారించేందుకు అక్కడ రాష్ట్రపతి పాలన నిర్వహించాలని ఆయనవిజ్ఞప్తి చేశారు. ఈ కేసులో తమ తమ వాదనలను ఈ నెల 26 లోపు పూర్తి చేయాలని రాజ్యంగ ధర్మాసనం ఆదేశించింది.












Click it and Unblock the Notifications
