ముంబాయి: అండర్ వరల్డ్ మాఫియా లీడర్ ఛోటా షకీల్ గ్యాంగ్‌లోనిటాప్ షూటర్ ఉస్మాన్ బొరాను ముంబాయి పోలీసులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించాడు. ఈ ఎన్‌కౌంటర్ దక్షిణ ముంబాయిలోని నాడపడలో ఆదివారం జరిగింది.
వసూలు చేసిన డబ్బును ఒక వ్యక్తి నుంచి తీసుకోవడానికి ఉస్మాన్ నాగపడ వస్తున్నట్లు పోలీసులకు సమాచారంఅందింది. దీంతో అతడ్ని అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు మాటు వేవారు. ఉస్మాన్ రాగానే లొంగిపోవాల్సిందిగా పోలీసులు ఆదేశించారు. అయితే అతను పోలీసులపైకి కాల్పులు జరిపాడు. పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఎదురు కాల్పుల్లో ఉస్మాన్ తీవ్రంగా గాయపడ్డాడు. అస్పత్రి తరలిస్తుండగా అతను మరణించాడు.హత్య, అక్రమ వసూళ్లకు సంబంధించి ఉస్మాన్‌పై డజనుకుపైగా కేసులున్నాయి. పరారీలో ఉన్న పేరు మోసిన గ్యాంగ్‌స్టర్‌ఫీరోజ్ కొంకనికి అతను సన్నిహిత అనుచరుడు. ఛోటా షకీల్ గ్యాంగ్‌లోని పది మందిటాప్ షూటర్లలో ఉస్మాన్ ఒకడని పోలీసులు చెప్పారు.