కర్నూలు: అండర్‌వరల్డ్ డాన్ అబూ సలేంకు, సినీనటి మోనికా బేడికి, మరో వ్యక్తికి మారుపేర్లతో పాస్‌పోర్టులు ఇప్పించిన ఏజెంట్ హమీద్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నాలుగు పోలీసు బృందాలు అతని కోసం గాలిస్తున్నాయి.
అయితే, పోలీసులు ఇప్పటి వరకు హమీద్ ఇంటికి కూడా వెళ్లలేదని తెలుస్తోంది. కర్నూలులోనిపాతబస్తీలో అతని ఇల్లు ఉంది. హమీద్ కర్నూలులోని ఎలైట్ హోటల్‌లో సప్లయర్‌గా పని చేసేవాడు. చాలా కాలం క్రితమే తప్పుడు పాస్‌పోర్టుల వ్యవహారం తెలిసినప్పటికీ పోలీసు అధికారులు బయటపెట్టలేదు. ఈవిషయం మూడు నెలల క్రితమే తెలుసునని డిజిపిపేర్వారం రాములు అంటున్నారు. ఈ సమయంలోనే హమీద్ పారిపోయి ఉంటాడని భావిస్తున్నారు. హమీద్ ఈ అక్రమాలకు పాల్పడినట్లు తమకు తెలియదని కుటుంబ సభ్యులంటున్నారు. అబూ సలేం పాస్‌పోర్టు జారీపై కేంద్ర దర్యాప్తు సంస్థ(సిబిఐ) దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది.