అద్వానీ, జోషీల హత్యకు అలీ కుట్ర
బెంగుళూర్: పోలీసుల చేతిలో హతమైన ఇమామ్ అలీ నేతృత్వంలోని ఆల్-ముజాహిదీన్ ఉపప్రధాని ఎల్.కె. అద్వానీని, కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి మురళీ మనోహర్ జోషిని హత్య చేసేందుకు కుట్ర పన్నినట్లు తమిళనాడుటాప్ సీనియర్ పోలీసు అధికారులు వెల్లడించారు.
అలీ గ్యాంగ్ తిరువనంతపురంలో మే 10వ తేదీన తమిళనాడు పోలీసుల నుంచి తప్పించుకుందని, అయితే పోలీసులు ఈ గ్యాంగ్ కదలికలపై నిఘా పెడుతూ వచ్చారని ఆయన చెప్పారు. హత్యాయత్నాలువిఫలం కావడంతో తమిళనాడు దేవాలయాల్లో బాంబులుపెట్టే ప్రయత్నంలో అలీ మునిగిపోయాడని ఆయన చెప్పారు. చెన్నైలోని ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయంలో బాంబుపేలిన సంఘటనలో అలీ పాల్గొన్నాడని ఆయన చెప్పారు. ఈ సంఘటనలో 14 మంది మరణించారు.












Click it and Unblock the Notifications
