కాంగ్రెస్‌ను తిప్పికొట్టండి: బాబు పిలుపు
హైదరాబాద్: కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాల్సిందిగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. తెలుగుదేశం కార్యవర్గం సమావేశంలో ఆయన గురువారం ప్రసంగించారు.
ఉచిత విద్యుత్ ఇస్తామంటూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారాన్ని తిప్పుకొట్టాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్ల్యేలు జట్లుజట్లుగా జిల్లాల్లో పర్యటించాలని సమావేశం నిర్ణయించింది. పంజాబ్ లో ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తామని వాగ్దానం చేసిన కాంగ్రెస్ అధికారంలోకి రాగానే చేతులెత్తేసిందని తెలుగుదేశం ఎద్దేవాచేసింది. అమలు సాధ్యం కాని హామీలు చేస్తున్న కాంగ్రెస్ అసలు రంగును బట్టబయలు చేయాలని తెలుగుదేశం తీర్మానించింది.












Click it and Unblock the Notifications
