తెలంగాణాలో బతుకమ్మ సందడి
వరంగల్: తెలంగాణాలో దసరా పండుగకు ఎంతో ప్రాధాన్యం ఉంది. బతుకమ్మ పండగను ఘనంగా నిర్వహించుకోవడం ఇక్కడి ఆచారం. దసరాకు తొమ్మిది రోజుల ముందు నుంచే బతుకమ్మ ఆటలను ఆడవారు మొదలుపెడుతారు. కొత్త పట్టు చీరలతో సింగారించుకొని అమ్మాయిలు, ముత్తైదవులు ఆట, పాటలతో బతుకమ్మను ఆడుతారు. తెలంగాణా పల్లెలు అంతటా ఇప్పుడు ఇదే సందడితో కళకళలాడుతున్నాయి. రంగురంగుల బుట్టలతో బతుకమ్మను అలంకరించారు.












Click it and Unblock the Notifications
