న్యూఢిల్లీ: కావేరీ జలాల విడుదల విషయంలో కర్ణాటక కావాలని కోర్టు ధిక్కారానికి పాల్పడినట్లు రుజువవుతోందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. వెంటనే తమిళనాడుకు కొంత నీటిని విడుదల చేయాలని కర్ణాటకను ఆదేశించింది.
కావాలని కోర్టు ఆదేశాలను కర్ణాటక బేఖాతరు చేసినట్లు అర్థమవుతోందని, ఈ విషయంపై ఈ నెల 29వ తేదీన నిర్ణయం తీసుకుంటామని ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్ అన్నది. ఈ లోగా తమిళనాడుకు కొంత నీటిని విడుదల చేయాలని కోర్టు కర్ణాటకను మరోసారి ఆదేశించింది.