ఖర్గే ర్యాలీ తర్వాత శుద్ధి చేసిన ఘటనపై FIR నమోదు.. 29 రోజులకు..
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇటీవల ఉత్తరాఖండ్ లోని హల్ద్వానిలో ఒక ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఒక వేదిక నుంచి ప్రసంగించారు. అయితే మరుసటి రోజు కొందరు బీజేపీ అనుకూల నేతలు ఖర్గే పాల్గొన్న ఆ వేదికను పసుపు నీళ్లతో శుద్దీకరణ ప్రక్రియ చేపట్టారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా దుమారం రేపింది. 29 రోజులుగా కాంగ్రెస్ నేతలు నిరసనలు తెలుపుతున్నారు. అయితే తాజాగా కాంగ్రెస్ పోరాటం ఫలించింది.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ పార్టీలోని దళిత, గిరిజన ఎంపీలు ఈ మేరకు దేశ రాజధానిలోని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ లో నిరసన తెలిపారు. వీరిలో కొడిక్కినిల్ సురేశ్, శశికాంత్ సెంథిల్, మల్లు రవి, వర్షా గైక్వాడ్, రాజేంద్ర పాల్ గౌతమ్, కే. రాజు తదితరులు ఉన్నారు. నిందితులపై జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు పోలీసులు తాజాగా ఈ ఘటనపై బీఎన్ఎస్ సెక్షన్స్ 196, 299 కింద కేసు నమోదు చేశారు. ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేయాలని 80 కు పైగా పిటిషన్ లు వచ్చినట్లు పోలీసులు పేర్కొన్నారు. అయితే తమకు ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చేంత వరకూ ఇక్కడి నుంచి వెళ్లేది లేదని కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ ఎదుటే మూడున్నర గంటలకుపైగా బైఠాయించారు. చివరకు పోలీసులు ఎఫ్ఐఆర్ కాపీని అందించడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు.

అంతకుముందు ఈ ఘటనపై లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లోక్ సభలో మండిపడ్డారు. ఈ చర్యకు పాల్పడిన నిందితులపై ఎస్సీ, ఎస్టీ యాక్ట్ ప్రకారం ఎఫ్ ఐఆర్ నమోదు చేసి చర్యలు తీసుకోవాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఖర్గే పాల్గొన్న వేదికను శుభ్రం చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. దళితుల విషయంలో ఆ పార్టీ నేతలు ఎలా వ్యవహరిస్తారో తెలుస్తోందని అన్నారు.












Click it and Unblock the Notifications
