ఇన్సాట్- 3ఎ ప్రయోగంసక్సెస్
ఫ్రెంచ్ గయానా: ఇన్సాట్- 3ఎ ఉపగ్రహాన్ని భారత్ విజయవంతంగా ప్రయోగించింది. ఫ్రెంచ్ గయానా నుంచి గురువారం ఉదయం నాలుగున్నర గంటల ప్రాంతంలో దీన్ని ప్రయోగించారు.
ఇన్సాట్- 3ఎ ప్రయోగం విజయవంతం కావడంతో భారత్ మరో మైలు రాయిని దాటిందని ఇస్రో చైర్మన్ కస్తూరి రంగన్ అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారినందరినీ ఆయన అభినందించారు. భారత్ ప్రయోగించిన ఉపగ్రహాల్లో ఇది అతి పెద్దది. ఇది కక్ష్యలో స్థిరపడడానికి వారం, పది రోజులు పడుతుంది. దీన్ని బుధవారం ప్రయోగించాల్సి వుండింది. అయితే స్వల్ప సాంకేతిక లోపాల వల్ల అది గురువారానికి వాయిదా పడింది.












Click it and Unblock the Notifications