వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రతి పల్లెకు పదివేలుఃసిఎం

By Staff
|
Google Oneindia TeluguNews

వరంగల్‌ః దోమల నివారణ,పారిశుద్ధ్యం పనుల కోసం ప్రతి గ్రామానికి 5 నుంచి 10వేల రూపాయలు మంజూరు చేయనున్నట్టు ముఖ్యమంత్రిచంద్రబాబు నాయుడు గురువారం ఉదయం ఇక్కడ ప్రకటించారు. వింత వైరస్‌ వల్ల అస్వస్ధులైన వారిని వరంగల్‌ ఎంజిఎం ఆస్పత్రిలో పరామర్శించిన అనంతరం ఆయన హన్మకొండ మండలం కొండపర్తి గ్రామం సందర్శించి బాధితులతో మాట్లాడారు.

ఈ గ్రామంలో వింత వైరస్‌వల్ల పది మంది అస్వస్ధులు కాగా అనిల్‌ అనే బాలుడు మరణించాడు.అనిల్‌ కుటుంబసభ్యులతో మాట్లాడిన తర్వాత ముఖ్యమంత్రిగ్రామంలో పారిశుద్ధ్య ఏర్పాట్లను సమీక్షించారు.ముళ్ళ చెట్లను కొట్టేయాలని, మురుగు నీరునిల్వ ఉండకుండా చూడాలని ఆయన అధికారులనుఆదేశించారు. శాశ్వత పారిశుద్ధ్యం పనుల కోసం ఈ గ్రామానికిపది లక్షల రూపాయలను ఆయన అక్కడకక్కడేమంజూరు చేశారు. గ్రామాల్లో విష జ్వరాల తీవ్రత కారణంగాతాను జన్మభూమి కార్యక్రమాలను రద్దు చేసుకునిఇక్కడికి వచ్చానని ముఖ్యమంత్రి చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X