కాంగ్రెస్ కుశివశంకర్, కేశవరావు రాజీనామా
తీవ్రవాదం పేరు చెప్పి పోలీసులు, పారా మిలటరీ బలగాలు పెద్దయెత్తున వస్తున్నాయని చెప్పడం ద్వారా డిజిపి, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు ప్రజలను భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తున్నారని డాక్టర్ కె. కేశవరావు (కాంగ్రెస్) విమర్శించారు. ప్రజల్లో మనో స్థయిర్యం కలిగించే విధంగా వారు వ్యవహరించడం లేదని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తోందని కూడా ఆయన విమర్శించారు. తాము ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడం లేదని సి. రామచంద్రయ్య (తెలుగుదేశం) అన్నారు. మూడు నెలల క్రితం పార్టీలో అంతర్గతంగా పంపిణీ కోసం వేసిన బుక్‌లెట్‌పై ఎన్నికల కమీషన్‌కు కాంగ్రెస్ ఫిర్యాదు చేసిందని, పుస్తక ప్రచురణకర్త, ముద్రాపకుల పేర్లు ప్రకటించకపోవడమనే చిన్న పొరపాటుపై పెద్ద రాద్దాంతం చేస్తున్నారని, అయినా ఈ విషయమై ఎన్నికల కమీషన్‌కు నివేదిక పంపుతామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications