కాంగ్రెస్ కుశివశంకర్, కేశవరావు రాజీనామా
దగ్గుబాటి వెంకటేశ్వరరావు వెల్లడించిన అభిప్రాయంతో పార్టీకి సంబంధం లేదని ఆయన అన్నారు. కుప్పం నియోజకవర్గంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై ఆయన తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడును పోటీకి దింపబోమని శ్రీనివాస్ స్పష్టం చేశారు. సర్వే నివేదికలను వెల్లడించాలని పిసిసి మాజీ అధ్యక్షుడు ఎం. సత్యనారాయణరావు చేసిన డిమాండ్‌ను అంగీకరించడం సాధ్యం కాదని ఆయన అన్నారు. సర్వేలు చేయించడమనేది పార్టీ అంతర్గత వ్యవహారమని, వాటి వివరాలను వెల్లడించాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.
తాము అధికారంలోకి వస్తే ప్రపంచ బ్యాంక్ నుంచి తెచ్చిన అప్పులపై విచారణ జరిపిస్తామని ఆయన చెప్పారు. వామపక్షాలతో సీట్ల సర్దుబాటు త్వరలో జరుగుతుందని, ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాతనే అభ్యర్థుల జాబితా వెల్లడిస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications