కాంగ్రెస్ కుశివశంకర్, కేశవరావు రాజీనామా
దాన్ని పరిశీలించి నివేదిక సమర్పిస్తామని సమాచార శాఖ అధికారి ఒకరు మంగళవారంనాడు చెప్పారు. తాను సాధించిన విజయాలపై తెలుగుదేశం ప్రభుత్వం లఘు పుస్తకం ప్రచురించి పంపిణీ చేయడం ద్వారా ఎన్నిక ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిందని కాంగ్రెస్ ఈ నెల 6వ తేదీన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి నారాయణరావుకు ఫిర్యాదు చేసింది. ఈ విషయంపై విచారణ జరిపించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఫోటోతో 94 పేజీల బుక్‌లెట్‌ను ప్రచురించి పంపిణీ చేశారని, ఇది ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమేనని కాంగ్రెస్ అధికార ప్రతినిధి కె. రోశయ్య అన్నారు. బుక్‌లైట్‌పై, కరపత్రంపై లేదా బ్రోచర్‌పై ప్రచురణకర్త, ముద్రాపకుడి పేర్లు ఉండాలని, కానీ వంద నెలల అభివృద్ధిపై ప్రచురించిన బుక్‌లైట్‌పై ఎవరి పేర్లు లేవని ఆయన అన్నారు. ప్రజల డబ్బులతో లక్షలాది పుస్తకాలను ప్రభుత్వం అచ్చేసిందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications