కర్నూలు:కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ (డిసిసి)కార్యాలయం మంటల్లో చిక్కుకుంది. తమనాయకుడు కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డికి కర్నూలు లోక్‌సభ సీటురానందుకు నిరసనగా ఆయనఅనుచరులు డిసిసి కార్యాలయంపైదాడి చేశారు.
డిసిసికార్యాలయంలో కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి అనుచరులు విధ్వంసంసృష్టించారు. దాంతో ఆగకుండాకార్యాలయానికి నిప్పంటించారు. దీంతోకార్యాలయం మంటల్లో చిక్కుకుంది. అగ్నిమాపకదళం సిబ్బంది మంటలనుఆర్పడానికి రంగప్రవేశం చేశారు.కార్యకర్తలు కొందరు ఆత్మాహుతియత్నానికి పాల్పడ్డారు. వీరిని పోలీసులుఅరెస్టు చేశారు. కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డికి టికెట్ రాకపోవడానికికాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ(సియల్‌పి) మాజీ నేత డాక్టర్‌వై.యస్. రాజశేఖర్‌రెడ్డియేకారణమని వారు ఆరోపించారు.రాజశేఖర్‌రెడ్డికి వ్యతిరేకంగాపెద్ద పెట్టున నినాదాలు చేశారు. కోట్లసూర్యప్రకాశ్ రెడ్డికి టికెట్‌నిరాకరించి కర్ణాటక మాజీ డిజిపిశ్రీనివాసులుకు టికెట్ ఇచ్చారనేది వారిఆరోపణ.