క్రిస్టియానో రొనాల్డో రిటైర్మెంట్ పై తేల్చి చెప్పిన చెల్లి

ఫిఫా వరల్డ్ కప్ లో పోర్చుగల్ అద్భుతాన్ని సాధించింది. నాకౌట్స్ లో పెనాల్టీ షూటౌట్స్ వరకూ వెళ్లాల్సిన మ్యాచ్ లో చివరి నిమిషంలో కాపాడుకోగలింది. క్రొయేషియాను మట్టికరిపించింది. టొరంటో స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో పోర్చుగల్ 2-1 తేడాతో విజయం సాధించింది. ఇరు జట్ల మధ్య సాగిన ఈ రసవత్తర పోరు చివరి నిమిషం వరకు ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసింది. స్టార్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో, యువ సంచలనం గొన్సాలో రామోస్ అద్భుతమైన గోల్స్ సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ విజయంతో రౌండ్ ఆఫ్ 16లో ప్రవేశించింది పోర్చుగల్.

ఈ పరిస్థితుల మధ్య రొనాల్డో అంతర్జాతీయ కెరీర్‌ ముగింపునకు సంబంధించి ఆయన సోదరి కాటియా అవెరో కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఫిఫా ప్రపంచకప్ టోర్నమెంట్ రొనాల్డోకు చివరిది కానుందని ఆమె పరోక్షంగా సంకేతాలిచ్చారు. మైదానంలో రొనాల్డో సాగించిన సుదీర్ఘ అద్భుత ప్రస్థానం త్వరలోనే ముగియనుందనే వార్త ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫుట్‌బాల్ అభిమానుల్లో అప్పుడే తీవ్ర చర్చకు దారితీస్తోంది. డిబేట్స్ కు తెర తీసింది.

Katia Aveiro Cristiano Ronaldo Sister hinted that FIFA World Cup is the Last Dance for Her Brother

క్రొయేషియాతో మ్యాచ్‌ అనంతరంఆమె అవెరో విలేకరులతో మాట్లాడారు. ఈ ప్రపంచకప్ రొనాల్డో ఆడుతున్న చివరి టోర్నీ అని తాను బలంగా నమ్ముతున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం రొనాల్డో వయసు 41 అని గుర్తు చేశారు. కెరీర్ ముగింపు దశలో పోర్చుగల్ తరఫున ప్రతిష్టాత్మకమైన ప్రపంచకప్ ట్రోఫీని గెలవడమే ఆయన ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. తనకు ఉన్న సమాచారం ప్రకారం రొనాల్డో త్వరలోనే అంతర్జాతీయ సాకర్‌కు వీడ్కోలు పలికే అవకాశం ఉందని కాటియా తెలిపారు.

పరిస్థితులను గమనిస్తే ఫుట్ బాల్ కు రొనాల్డో వీడ్కోలు పలికే సమయం దగ్గరపడిందని, అది ఇప్పుడే జరగొచ్చు లేదా అతి త్వరలోనే సంభవించవచ్చని కాటియా పేర్కొన్నారు. ఇది రొనాల్డోకు చివరి ప్రపంచకప్ అని తాను ఖచ్చితంగా నమ్ముతున్నానని తేల్చి చెప్పారు. తనకు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందిందని, ఇది రొనాల్డో ఆడే చివరి మ్యాచ్‌ల సమాహారం అనడంలో సందేహం లేదని అన్నారు.

రొనాల్డోతో పాటు క్రొయేషియా దిగ్గజ కెప్టెన్ లూకా మోడ్రిచ్‌కు కూడా అంతర్జాతీయ స్థాయిలో చివరి ఆట లాంటిదని కాటియా అభివర్ణించారు. ఈ వరల్డ్ కప్ ప్రారంభ మ్యాచ్ లల్లో రొనాల్డో విఫలం కావడంపై వచ్చిన విమర్శలపై ఆమె తీవ్రంగా స్పందించారు. రొనాల్డో ప్రతిభను గుర్తించని వారికి అసలు ఫుట్‌బాల్ ఆట గురించే అవగాహన ఉండదని ఆమె ఘాటుగా విమర్శించారు. ఫుట్ బాల్ చరిత్రలో రొనాల్డో సాధించిన విజయాలు ఎప్పటికీ అపూర్వమైనవని స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+