దీపావళి వేళ తస్మాత్ జాగ్రత్త.. ఈ లింక్స్ పై క్లిక్ చేస్తే ఇక అంతే..

సైబర్ మోసాలు ఇటీవలి కాలంలో విస్తృతంగా పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా పండగ సమయాల్లో ఇదే అదనుగా భావిస్తున్న సైబర్‌ నేరస్థులు కొత్త కొత్త ట్రిక్స్​ తో మోసాలకు తెగబడుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీపీ సజ్జనార్ కీలక సూచనలు చేశారు. దీపావళి పండుగ సందర్భంగా సైబర్ నేరగాళ్లు కొత్త మోసం చేస్తున్నారని సజ్జనార్ తెలిపారు. ఈ మోసం ప్రకారం 'పేటీఎం అందరికీ రూ.1000 నగదు దీపావళి గిఫ్ట్‌గా ఇస్తోంది' అనే మెసేజ్ తో సైబర్ కేటుగాళ్లు ప్రజల్ని మోసం చేస్తున్నారని పేర్కొన్నారు. పేటీఎం దీపావళి కానుకగా అందరికీ రూ.1,000 నగదు ఇస్తోంది.. వెంటనే క్లెయిమ్ చేసుకోండి' అంటూ సోషల్ మీడియాలో, ముఖ్యంగా వాట్సాప్‌ లో వైరల్ అవుతున్న సందేశం పచ్చి మోసంగా తెలిపారు.

'నేను ఫేక్ అనుకున్నా.. కానీ నిజంగానే రూ.1,000 వచ్చాయి.. మీరు ట్రై చేయండి' అంటూ నమ్మించే రీతిలో కేటుగాళ్లు పన్నిన ఉచ్చు ఇది అని తెలిపారు. పండుగ పూట ప్రజల అమాయకత్వాన్ని, ఆశను ఆసరాగా చేసుకుని సైబర్ ముఠాలు కాటేసేందుకు సిద్ధమయ్యాయని స్పష్టం చేశారు. ఇలాంటి సందేశాలతో పాటు వచ్చే అనుమానాస్పద లింకులను (http://akcxy.buzz వంటి నకిలీ వెబ్‌ సైట్లు) పొరపాటున కూడా క్లిక్ చేయవద్దని సూచనలు చేశారు. ఈ లింకుల ద్వారా మీ వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ వివరాలు దొంగిలించడమే కాకుండా.. మీ ప్రమేయం లేకుండానే బ్యాంకు ఖాతాలు ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని స్పష్టం చేశారు.

Sajjanar key suggestions for Diwali gifts in the name of cyber scams are coming latest tweet viral

ఏ ప్రముఖ సంస్థ కూడా అపరిచిత లింకుల ద్వారా ఉచితంగా నగదు పంపిణీ చేయదని ప్రతి ఒక్కరూ గుర్తించాలని సీపీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. గుర్తుతెలియని, అనుమానాస్పద వెబ్‌సైట్ లింకులపై క్లిక్ చేయకండి..నకిలీ ఆఫర్లను నిజమని నమ్మి ఇతర వాట్సాప్ గ్రూపులకు, బంధుమిత్రులకు ఫార్వర్డ్ చేసి ఇతరులనూ ముప్పులోకి నెట్టకండి. ఎలాంటి సందర్భంలోనూ బ్యాంకింగ్ వివరాలు, యూపీఐ పిన్, ఓటీపీలను ఎవరితోనూ పంచుకోవద్దు.. అలాగే ఒకవేళ మోసపోతే వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌ లైన్ నంబర్ 1930 కు ఫోన్ చేయండి లేదా https://cybercrime.gov.in) వెబ్‌ సైట్‌ లో ఫిర్యాదు నమోదు చేయండి అని సీపీ సజ్జనార్ కీలక సూచనలు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+