79 ఏళ్ల స్వతంత్ర భారతంలో సామాన్యుడి రైలు ప్రయాణం ఇదీ.. కేతిరెడ్డి పోస్టు వైరల్

భారత్ లో నిత్యం లక్షలాది మంది ప్రజలు రైలు ప్రయాణాలు చేస్తుంటారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించే వెసులుబాటు రైలు ప్రయాణానికి మాత్రమే ఉంది. ఈ క్రమంలో దేశంలోని పేద, మధ్య తరగతి ప్రజలు నిత్యం రైలు ప్రయాణాన్నే ఎంచుకుంటారు. అయితే సామాన్య ప్రజలు ఎక్కే జనరల్ బోగీల్లో ఎప్పుడూ రద్దీగానే ఉంటాయి. అక్కడ ఒక్క సీటు దొరకడం కూడా కష్టమేనని తెలిసిందే. ఇక పండగల సీజన్ లో అయితే రైలు బోగీలో కనీసం కాలు పెట్టేందుకు కూడా ఖాళీ లేక చిన్నారులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతూ ప్రయాణం చేస్తున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి.

ఓవైపు వందే భారత్, బుల్లెట్ రైలు అంటూ కేంద్రం ఎప్పటికప్పుడు రైల్వే వ్యవస్థను అభివృద్ధి పథంలోకి నడిపించేందుకు యత్నిస్తుంటే మరోవైపు సామాన్య ప్రజలు మాత్రం జనరల్ బోగీల్లోనే మగ్గిపోతున్నారు. ఈ క్రమంలో ధర్మవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి రైలు ప్రయాణాలపై చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. 79 ఏళ్ల స్వతంత్ర భారతంలో సామాన్యుడి రైలు ప్రయాణ విషాద స్థితి ఇదీ.. అని ఆయన ప్రస్తావించిన తీరు నెటిజన్లను ఆలోచింపజేస్తోంది.

వందే భారత్ బాత్‌ రూమ్‌ లు బాగున్నాయని, బుల్లెట్ ట్రైన్ వస్తుందని ప్రచారం చేసుకోవడమే ఘనం. కానీ సామాన్యుడు ప్రయాణించే జనరల్ బోగీల పరిస్థితి ఇది! రైల్వే మంత్రి గారూ.. ఒక్కసారి ఈ దృశ్యాలు చూడండి.. అని కేతిరెడ్డి పేర్కొన్నారు. ఏడాదంతా పట్నంలో కష్టపడి, పండుగకు సొంతూళ్లకు బయలుదేరిన వలస జీవులు వీళ్లు.. చేతిలో టికెట్ ఉన్నా బోగీలో అడుగు పెట్టే చోటు లేదు. తలుపు దగ్గర తోపులాట, కిటికీల నుంచి దూరడం. చంటి బిడ్డను గుంపు పైనుంచి లోపలికి అందిస్తున్న వైనం చూస్తే హృదయం ద్రవిస్తుందోనని ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్లు భారతీయులే కదా..? వాళ్లు మనుషులే కదా..? ఇంత దారుణమా అని ప్రశ్నించారు. ఇది భోపాల్ జంక్షన్‌ లో దీపావళి ప్రయాణం అని స్పష్టం చేశారు.

Kethireddy Venkatarami Reddy former MLA video on indian railways goes viral train travel common man

పండుగ రద్దీ ఎంత ఉంటుందో ముందే తెలుసు. మరి ముందే అదనపు రైళ్లు, అదనపు జనరల్ బోగీలు, ప్లాట్‌ ఫాంపై సిబ్బంది ఎందుకు ఏర్పాటు చేయలేకపోతున్నారు..? అని కేతిరెడ్డి ప్రశ్నించారు. ఏసీ బోగీలు కొందరి కోసం, జనరల్ బోగీలు కోట్ల మంది కోసం. అభివృద్ధి అంటే వేగంగా వెళ్లే కొన్ని రైళ్లు మాత్రమే కాదు, సామాన్యుడు గౌరవంగా, సురక్షితంగా ఇంటికి చేరడం కూడా!.. అని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+