తెలంగాణనీటిని దోచుకుంటున్నారు: కడియం
వరంగల్:కాంగ్రెస్, తెలంగాణ రాష్ట్ర సమితి(టిఆర్‌యస్) సంకీర్ణ రాష్ట్రప్రభుత్వం తెలంగాణకు తీరనిద్రోహదం చేస్తోందని తెలుగుదేశంనాయకుడు, భారీ నీటి పారుదల శాఖ మాజీమంత్రి కడియం శ్రీహరి విమర్శించారు.తెలంగాణకు ఇప్పుడు జరుగుతున్నఅన్యాయాన్ని భవిష్యత్తులోసరిచేసుకోవడానికి వీలు లేకుండాపోతుందని ఆయన సోమవారం ఇక్కడఅన్నారు.
తెలంగాణకుచెందిన నదీ జలాలను ఇతర ప్రాంతాలకుతరలించే కుట్ర జరుగుతోందని ఆయనఅన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలనురెచ్చగొట్టి మంత్రి పదవులు పొందినటిఆర్‌యస్ మంత్రులు దీనిపై ఎందుకుమాట్లాడటం లేదని ఆయన ప్రశ్నించారు.నీటి పారుదల ప్రాజెక్టులకు ఖర్చుచేస్తున్న నలబై ఆరు వేల కోట్లరూపాయాల్లో తెలంగాణా ప్రాంతంలోనిప్రాజెక్టులకు ఎంత ఖర్చు పెడుతున్నారోచెప్పాలని ఆయన ముఖ్యమంత్రి డాక్టర్‌వై.యస్. రాజశేఖర్ రెడ్డిని డిమాండ్‌చేశారు. సాగు నీటి ప్రాజెక్టులకుపెడుతున్న ఖర్చులను ప్రాంతాలవారీగావెల్లడించాల్సిన అవసరం ఉన్నదనిఆయన అన్నారు.గోదావరిజలాలను పోలవరం ప్రాజెక్టు ద్వారాప్రకాశం బ్యారేజీకి, దుమ్ముగూడెంప్రాజెక్టు ద్వారా నాగార్జునసాగర్‌టెయిల్ పాండ్‌కు తరలించేప్రయత్నాలు ఊపందుకున్నాయని,భవిష్యత్తులో తెలంగాణలోని ఇచ్చంపల్లివంటి ప్రాజెక్టులకు చుక్కనీరు కూడాలభించని స్థితి దాపురిస్తుందని ఆయనఅన్నారు. తెలంగాణకు దక్కాల్సినగోదావరి జలాలను ఇతర ప్రాంతాలకుతరలించే ప్రయత్నాలుజరుగుతున్నాయని ఆయన అన్నారు.గోదావరి జలాలపై అఖిల పక్ష సమావేశంఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్‌చేశారు. నక్సల్స్‌తో చర్చలపైరాజశేఖర్ రెడ్డి ద్వంద్వ వైఖరిఅవలంబిస్తున్నారని ఆయనవిమర్శించారు.











Click it and Unblock the Notifications