3 కోట్ల మందిని కాపాడాను: డొనాల్డ్ ట్రంప్ సంచలనం!

భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య జరగాల్సిన ఓ పెద్ద అణు యుద్ధాన్ని తాను ఆపినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఇరు దేశాలపై భారీ సుంకాలు విధిస్తామని బెదిరించడం ద్వారా తాను ఈ యుద్ధాన్ని ఆపేసినట్లు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. తన అధ్యక్ష పదవీ కాలంలో తన వాణిజ్య విధానాలు 8 యుద్ధాలను నివారించడంలో సహాయపడ్డాయని కూడా ట్రంప్ చెప్పారు. అలా చేయడం ద్వారా తాను 3 కోట్ల మంది ప్రాణాలను కాపాడానని ట్రంప్ వెల్లడించారు.

గురువారం ఓ ఇంటర్వ్యూలో.. డొనాల్డ్ ట్రంప్ దిగుమతి సుంకాల గురించి వ్యాఖ్యానించారు. తమ వాణిజ్య విధానాల వల్లే తన అధ్యక్ష కాలంలో 8 యుద్ధాలు ఆగిపోయాయని.. అందులో 5 యుద్ధాలు కేవలం టారిఫ్ హెచ్చరికల వల్లే నిలిచిపోయాయని ట్రంప్ పేర్కొన్నారు. భారత్, పాకిస్థాన్ దేశాలు పోరాటం కొనసాగిస్తే.. తాను 200 శాతం సుంకాలు విధిస్తానని హెచ్చరించినట్లు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు.

US President Donald Trump claims He Saved 30 Million Lives by Stopping India-Pakistan Nuclear War

యుద్ధం జరిగే సమయంలో రెండు దేశాలకు చెందిన 11 యుద్ధ విమానాలు కూలిపోయాయని.. పరిస్థితి అణుయుద్ధం వైపు దారితీస్తోందని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు." భారత్, పాకిస్థాన్ రెండు దేశాలు కూడా శక్తివంతమైన అణ్వాయుధ దేశాలు. నేను జోక్యం చేసుకుని యుద్ధాన్ని ఆపడం వల్లే 3 కోట్ల మంది ప్రాణాలు దక్కాయని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ స్వయంగా నన్ను ప్రశంసించారు" అని డొనాల్డ్ ట్రంప్ ఈ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

డొనాల్డ్ ట్రంప్ వాదనను తిరస్కరించిన భారత్
అయితే భారత్, పాక్ దేశాల మధ్య జరిగిన వివాదంలో అమెరికా మధ్యవర్తిత్వం వహించిందనే డొనాల్డ్ ట్రంప్ వాదనలను భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు తోసిపుచ్చుతూనే ఉంది. ఈ రెండు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపేశానని ట్రంప్ చెప్పుకోవడం ఇది మొదటిసారి కాదు. కానీ ఇరు దేశాల డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (డీజీఎంఓ)ల మధ్య జరిగిన ద్వైపాక్షిక చర్చల ద్వారా మాత్రమే కాల్పుల విరమణ సాధ్యమైందని భారత్ గట్టిగా పునరుద్ఘాటించింది. పాకిస్తాన్ వైపు నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకే ఈ చర్చలు జరిగాయని.. ఇందులో మూడో దేశం జోక్యం ఏమీ లేదని భారత్ ఇదివరకే గట్టిగా బదులిచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+