సోనియానేమా నేత: టిఆర్‌యస్ మంత్రి
నెల్లూరు:కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీయే తమ నాయకురాలనితెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌యస్)రాష్ట్ర మంత్రి నాయని నర్సింహారెడ్డిఅన్నారు. సోనియా గాంధీ వల్లనేతెలంగాణ రాష్ట్రం సాధ్యమని ఆయనవిలేకరులతో అన్నారు. ఒక అధికారికకార్యక్రమంలో పాల్గొనడానికిసోమవారం ఇక్కడికి వచ్చిన మంత్రివిలేకరులతో మాట్లాడారు.
సోనియాగాంధీ వల్లనే తమకు రాష్ట్రంలోమంత్రి పదవులు వచ్చాయని, సోనియాచెప్పకపోతే తాము రాష్ట్రంలోప్రభుత్వంలో చేరేవారం కాదనిఆయన అన్నారు. తమకు, కాంగ్రెస్‌కుమధ్య తగాదా ఏదీ లేదని,సత్సంబంధాలే ఉన్నాయని ఆయన స్పష్టంచేశారు. చిన్న తగాదాలను పెద్దగాచేసి చూపుతున్నారని ఆయన అన్నారు."మీరు ఏదో రెచ్చగొట్టే ప్రశ్నవేస్తారు. మేం ఏదో మాట్లాడాతాం. అదివివాదం మారుతుంది అని ఆయనవిలేకరులను ఉద్దేశించి అన్నారు. ఒకవేళ విడిపోతే అన్నదమ్ముల మాదిరిగావిడిపోతామని ఆయన చెప్పారు.తెలంగాణవిషయంలో కాంగ్రెస్, టిఆర్‌యస్‌ల వైఖరిఒకటేనని ఆయన అన్నారు. పొట్ట కూటికివచ్చినవారితో సమస్య లేదని, పొట్టకొట్టడానికి వచ్చినవారితోనే సమస్య అనితాము మొదటి నుంచి చెబుతూవస్తున్నామని, శాంతియుతపద్ధతుల్లో తెలంగాణసాధించుకుంటామని ఆయనఅన్నారు.











Click it and Unblock the Notifications