మావోయిస్టులకుఇది తగదు: వైయస్
రాజమండ్రి:పులిచింతల ప్రాజెక్టు శంకుస్థాపనరాయిని ధ్వంసం చేయడంనక్సలైట్లకు తగదని ముఖ్యమంత్రిడాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డిఅన్నారు. చట్టాన్ని తమ చేతుల్లోకితీసుకోవడం సరి కాదని ఆయనసోమవారం ఇక్కడ విలేకరులసమావేశంలో సిపిఐ (మావోయిస్టు)నక్సలెట్లను ఉద్దేశించి అన్నారు.
ఆయనపోలవరం ప్రాజెక్టు కుడి కాలువప్రాజెక్టుకు భూమి పూజ చేశారు. ఈసందర్భంగా ప్రాజెక్టునువ్యతిరేకిస్తూ రైతుకూలీ సంఘంఆధ్వర్యంలో ప్రదర్శన జరిగింది. దీంతోముఖ్యమంత్రి ముంపు బాధితులకువరాల వర్షం కురిపించారు. ప్రాజెక్టుకింద భూములు కోల్పోయేవారికి ఆయకట్టుకింద భూములు ఇస్తామని, యాబై వేలరూపాయలేసి ఖర్చుతో ఇళ్లుకట్టిస్తామని ఆయన హామీ ఇచ్చారు. కృష్ణాడెల్టాకు రబీలో నీరు అందిస్తామని ఆయనచెప్పారు.
పోలవరంఎడమ కాలువ ప్రాజెక్టుకు ఐక్య ప్రగతిశీలకూటమి హోదాలో సోనియా గాంధీ భూమి పూజచేస్తారని ఆయన చెప్పారు. షిప్‌బ్రేకింగ్ కంపెనీని ఎక్కడ పెట్టాలనేవిషయాన్ని నిర్ధారించడానికి ఒక కమిటీవేసినట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications