హైకోర్టులోజయేంద్రకు చుక్కెదురు:బెయిల్‌నిరాకరణ
చెన్నై: కంచికామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతిబెయిల్ పిటిషన్‌ను చెన్నై హైకోర్టుశనివారం సాయంత్రం తిరస్కరించింది.ప్రస్తుత పరిస్ధితుల్లో జయేంద్రసరస్వతికి బెయిల్ ఇవ్వడం సాధ్యంకాదని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్‌బాలసుబ్రమణ్యం తీర్పు ఇచ్చారు. జయేంద్రనువిచారించడానికి వీలుగా ఆయనను మరికొన్నిరోజులు పోలీసు కస్టడీలోఉంచడానికి అనుమతించవలసిందిగా పోలీసులుకోర్టును కోరారు.
కంచి స్వామిని పోలీసు కస్టడీకి కాంచీపురం కోర్టుపంపడాన్ని సవాలు చేస్తూ దాఖలైన మరోపిటిషన్‌పై మరోన్యాయమూర్తి విచారణను, నిర్ణయాన్ని సోమవారానికివాయిదా వేశారు. పోలీసులు శనివారం జయేంద్ర సరస్వతిని చాలాసేపువిచారించారు.కంచి మఠం మేనేజర్‌ను కూడా రెండుగంటల సేపు విచారించారు.












Click it and Unblock the Notifications