పోలీసుకస్టడీపై కంచి స్వామి పిటిషన్‌తోసివేత
చెన్నై/కాంచీపురం: కంచి కామకోటి పీఠాధిపతిజయేంద్ర సరస్వతి పోలీసు కస్టడీనిసవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌నుమద్రాసు హైకోర్టు కొట్టివేసింది. పోలీసుకస్టడీకి రిమాండ్ చేసే అధికారంకాంచీపురం ఫస్టు క్లాస్ మెజిస్ట్రేట్‌కుఉన్నదని హైకోర్టుఅభిప్రాయపడింది.
పోలీసులుఇంటరాగేట్ చేస్తున్నప్పుడు స్వామితరఫు న్యాయవాది ఉండవచ్చుననిజస్టిస్ ఎ.కె. రాజన్ చెప్పారు.బెయిల్‌కోసం సుప్రీంకోర్టుకు వెళ్లాలా వద్దా అనేవిషయంపై జయేంద్ర సరస్వతి ఇప్పటివరకు నిర్ణయం తీసుకోలేదని కంచిస్వామి తరఫు న్యాయవాది త్యాగరాజన్‌చెప్పారు. సుప్రీంకోర్టుకు వెళ్లేవిషయంపై ఇప్పటి వరకు ఏ నిర్ణయమూతీసుకోలేదని ఆయన సోమవారంచెప్పారు. జయేంద్ర సరస్వతి పోలీసుకస్టడీని పెంచడానికి కాంచీపురం కోర్టువ్యతిరేకంగా నిర్ణయాన్ని వెలువరించినవెంటనే ఆయన విలేకరులతోమాట్లాడారు.











Click it and Unblock the Notifications
