పసి పిల్లలనుకబళించిన పోలియో చుక్కలు

హైదరాబాద్‌:పోలియో చుక్కలు మింగిన నలుగురుపసిపిల్లలు ఆదివారంనాడు ఖమ్మం జిల్లాలోమృత్యువాత పడ్డారు. ఈ సంఘటన తీవ్రసంచలనం సృష్టించింది. అయితేమరణాలు పోలియో చుక్కల వల్లసంభవించాయనే ఆరోపణను జిల్లాఅధికారులు కొట్టివేస్తున్నారు.

పోలియోచుక్కలు వేసుకున్న మర్నాటి నుంచేతమ పిల్లలు మరణించారని వారితల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఆర్‌.రమణ, లక్ష్మి, రుక్మిణి, స్వాతి అనేపిల్లలను మృత్యువు కబళించింది.వీరందరూ రెండేళ్ల నుంచి పదేళ్లమధ్య వయస్సున్న పిల్లలు. పోలియోచుక్కల వల్ల మరణాలుసంభవించలేదని, ఇతర ఆరోగ్యసమస్యల వల్ల వారు మరణించారనిజిల్లా కలెక్టర్‌ రాజేంద్ర నరేంద్రనింజే అన్నారు.పొలియోచుక్కలు వేసుకున్న మర్నాడు ఆ పిల్లలుమరణించడం యాదృచ్ఛికమేననిజిల్లా వైద్య, ఆరోగ్యాధికారి డాక్టర్‌ ఆర్‌.కృష్ణమూర్తి అన్నారు. న్యుమోనియా,చిన్నప్రేవుల్లోని సమస్యల వల్లసంభవించాయని ఆయన అన్నారు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+