శంకరరామన్‌హత్యకేసులో మరో కీలకవ్యక్తిఅరెస్టు
చెన్నై:శంకరరామన్ హత్యకోసంకత్తులు కటారులు సరఫరా చేసినఅభియోగంపై అనిల్‌కుమార్ అనే వ్యక్తినిగురువారం ఉదయం పోలీసులు అరెస్టు చేశారు. ఇతడిని ఇంటరాగేట్‌చేస్తేశంకరరామన్ హత్యలో జయేంద్రసరస్వతి ప్రమేయం ఎంతవరకుఉంటుందో స్పష్టం కాగలదని పోలీసులు చెబుతున్నారు. శంకరరామన్‌హంతకులు ప్రయాణించిన వాహనాన్ని కూడాఅనిల్‌కుమారే సమకూర్చాడని పోలీసులు అంటున్నారు.
అనిల్‌కుమార్‌నురేపు సాయంత్రం వరకు పోలీసుకస్టడీకి పంపడానికి మెజ్రిస్టేట్‌అంగీకరించారు. కాగా కంచి స్వామి తనతోమాట్లాడలేదని శంకరరామన్‌కేసులో ప్రధాన నిందితుడు కోర్టులోచెప్పడంతో గురువారం కంచిమఠంలోపండుగ వాతావరణం కన్పించింది. గతపదిరోజులుగా బోసిపోయిన కంచి మఠంలో భక్తుల సందడి పెరిగింది. గురువారంఉదయం చిన్నస్వామి విజయేంద్ర సరస్వతిగోపూజ చేశారు. అయితే ప్రతిరోజూ ఉదయంసాయంత్రం మఠం అధికారులు నిర్వహించే విలేకరులసమావేశం నేడు జరగలేదు.












Click it and Unblock the Notifications
