చంద్రబాబుకుకాంగ్రెస్ సూక్తి ముక్తావళి
హైదరాబాద్:త్వరలో అసెంబ్లీ సమావేశాలుజరుగనున్న నేపధ్యంలో కాంగ్రెస్‌లెజిస్లేచర్ పార్టీ (సిఎల్పీ) ప్రతిపక్షతెలుగుదేశం పార్టీ కోసం సూక్తిముక్తావళిని రూపొందించింది. అల్లరి చేయడానికి అసెంబ్లీని వేదికగావాడుకోవద్దని, అభివృద్ధికి బ్రేకులువేయవద్దని సిఎల్పీ శనివారం టిడిపిఅధినేత చంద్రబాబు నాయుడికి బహిరంగలేఖను విడుదల చేసింది. ఆ లేఖలోని విషయాలను కాంగ్రెస్‌పార్టీ విప్‌కిరణ్‌కుమార్ రెడ్డి మీడియాకువిడుదల చేశారు. అధికారంకోల్పాయనన్న దుగ్ధతో చంద్రబాబు నాయుడు ఇష్టమొచ్చిన రీతిలోవ్యవహరిస్తున్నారని ఆయనవిమర్శించారు. అనవసర విషయాలపైరాద్ధాంతం చేసిన విలువైన సభాసమయాన్ని వృధా చేయవద్దని,ముఖ్యమైన ప్రజా సమస్యలపై చర్చకుతాము సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
